పూసపాటిరేగ(M) పేరాపురం వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. విశాఖకు చెందిన శ్రీనివాస్, మన్యం జిల్లా జోగింపేటకు చెందిన సింహాచలం కారులో ప్రయాణిస్తుండగా, భోజనం కోసం ఆగిన శ్రీకాకుళం జిల్లా చిన్నసాన పంచాయతీ గంగుపేటకు చెందిన రాము, రమేశ్‌లను కారు ఢీకొంది. అనంతరం కారు లారీని ఢీకొనడంతో ఈ నలుగురు మృతి చెందారు.