విశాఖ: బీచ్‌లో స్నానాలు చేసే భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

2చూసినవారు
విశాఖలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం బీచ్‌ స్నానాలకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని విశాఖకు చెందిన మెరైన్ సీఐ రమేశ్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. డీఐజీ, అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే స్నానం చేయాలని, సెల్ఫీలు, వీడియోల కోసం లోపలికి వెళ్లవద్దని కోరారు. గజ ఈతగాళ్లు, పోలీసులు పహారా కాస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్