పరిశ్రమలకు సరఫరా చేసే ఐఎన్‌సీ డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు భారీగా పెంచడంతో రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడింది. మార్చి 20న లీటరు రూ. 96.24గా ఉన్న ధర ప్రస్తుతం రూ.149కు చేరడంతో సాధారణ డీజిల్‌పై డిమాండ్ పెరిగింది. కొందరు డీలర్లు డీజిల్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కంపెనీలు సరఫరా తగ్గించాయి, ఫలితంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగింది.