విశాఖ‌: 50వ వార్డులో 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ

4చూసినవారు
విశాఖ‌: 50వ వార్డులో 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ
విశాఖపట్నంలోని 50వ వార్డు పరిధిలో 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు శనివారం పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ 50వ వార్డు అధ్యక్షుడు కూన వెంకటరావు, సీనియర్ నాయకులు సనపల రామకృష్ణ, మండల అధ్యక్షుడు రామకృష్ణ, బీజేపీ మహిళా యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ భగది శ్యామల, చౌదరి ప్రసాద్, నాగరాజ్, రామరాజ్యం, సతీష్, అప్పలనాయుడు, పప్పల గౌరీ, శివ, సనపల గోవిందరాజులు తదితరులు వృద్ధులు, వితంతువుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్