డాబా గార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం సంక్రాంతి సంబరాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొని, సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం అని పేర్కొన్నారు. బ్రహ్మకుమారిస్ బి కె రామేశ్వరి మాట్లాడుతూ జనవరి 23వ తేదీ నుంచి రెండు రోజుల పాటు విశాఖ జిల్లా స్థాయి డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.