విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సోమవారం స్పష్టం చేస్తూ, ప్రజల నుంచి స్వీకరించే అర్జీల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, అదే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.