విశాఖ: గ్రంథాలయాల్లో చిత్రలేఖన శిబిరం

4చూసినవారు
విశాఖ: గ్రంథాలయాల్లో చిత్రలేఖన శిబిరం
ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ, వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చని అన్నారు. గురువారం విశాఖ కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన చిత్రలేఖన అవగాహన శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ శిబిరంలో 25 మందికి పైగా బాలబాలికలు పాల్గొని ఉత్సాహంగా చిత్రాలు గీశారు. కేవలం చిత్రలేఖనమే కాకుండా కథలు చెప్పడం, పుస్తకాలు చదవడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం చిన్నారులకు శీతల పానీయాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్