విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి కారు నడుపుతున్న డ్రైవర్ అతివేగంగా దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ పోల్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 112కు సమాచారం అందించడంతో ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కారును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.