విశాఖ: మద్దిలపాలెం ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ

2చూసినవారు
విశాఖ: మద్దిలపాలెం ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ
ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత, విశాఖ ఆర్‌ఎం బి. అప్పలనాయుడుతో కలిసి మంగళవారం మద్దిలపాలెం డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఈడీ మాట్లాడుతూ, డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఎస్‌బీఐ మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు. బస్టాండ్‌లలో 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లరాదని, ప్రమాదాల నివారణకు ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాలని, బస్సు రివర్స్ చేసేటప్పుడు కండక్టర్లు తప్పనిసరిగా సహకరించాలని ఆదేశించారు. ప్రతి బస్టాప్‌లోనూ బస్సులు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్