విశాఖ‌: కరకచెట్టు పోలమాంబ జాతరకు సర్వం సిద్ధం

3చూసినవారు
విశాఖ‌: కరకచెట్టు పోలమాంబ జాతరకు సర్వం సిద్ధం
విశాఖపట్నం పెదవాల్తేరులోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈఓ టి. రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న తోలేళ్ళ ఉత్సవం, 31న అనుపు ఉత్సవం, ఏప్రిల్ 7న మారువారం పండుగ, 11న మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు 70 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మద్ది శ్రీనివాసరెడ్డి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్