విశాఖ: ఆకట్టుకుంటున్న 5 అడుగుల తోటకూర మొక్క

14చూసినవారు
విశాఖ: ఆకట్టుకుంటున్న 5 అడుగుల తోటకూర మొక్క
విశాఖపట్నంలోని ఎం.వి.పి. కాలనీకి చెందిన 'గ్రీన్ క్లైమేట్ టీం' ఎన్జీవో వ్యవస్థాపకులు జె.వి. రత్నం తన ఇంటి వద్ద పెంచిన అరుదైన ఎరుపు రంగు స్థంభం తోటకూర మొక్క అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే ఈ తోటకూర, ఎరుపు రంగులో ఏకంగా 5 అడుగుల ఎత్తు పెరగడం విశేషం. తాము సేకరించిన దేశీయ విత్తనాల పరిశీలనలో భాగంగా ఈ మొక్కను పెంచామని, ఇది ఇంత పొడవుగా పెరగడం ఆశ్చర్యానికి గురిచేసిందని, అంతరించిపోతున్న ఈ అరుదైన విత్తనం దొరకడం సంతోషంగా ఉందని రత్నం తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you