విశాఖ‌: అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్టు

11చూసినవారు
విశాఖ‌: అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్టు
విశాఖలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగ మహేష్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కాకినాడ ప్రాంతానికి చెందిన ఇతను విశాఖలో దొంగతనాలు చేసి, ఆ సొమ్ముతో హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. నిందితుడిపై గతంలో తూర్పుగోదావరి జిల్లాలో 30 నుంచి 40కి పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు 2 కేజీల బంగారం, 8 కేజీల వెండి, రూ. 35 లక్షలకు పైగా నగదు చోరీ చేసిన కేసులో పోలీసులు అతడిని పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్