విశాఖ‌: చోరీ చేసులో విచార‌ణ ముమ్మ‌రం

460చూసినవారు
నగరంలోని ఇందిరానగర్‌లో సోమవారం ఓ వృద్ధురాలిని, ఆమె మనవడిని తాళ్లతో కట్టేసి దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు 10 తులాల బంగారం, రూ. 2 లక్షలు, ఎక్స్‌యూవీ కారును దోచుకుని పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలిస్తున్న పోలీసులు, కారును మారకవలస వద్ద గుర్తించారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

సంబంధిత పోస్ట్