జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం క్షేత్రస్థాయిలో వేగంగా కొనసాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సీతంపేట పార్టీ కార్యాలయంలో సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యత్వ ఇన్‌ఛార్జ్, సౌత్ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతపై దిశానిర్దేశం చేశారు. సభ్యత్వం ద్వారా పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తలకు భవిష్యత్ అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. సభ్యత్వ లక్ష్యాలు, నియోజకవర్గ కార్యాచరణపై చర్చించారు.