విశాఖపట్నంలోని 14 గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతరోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు జనసందోహంగా మారాయి. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో టి. రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య అమ్మవారి ఉత్సవం ఆధ్యాత్మిక శోభతో సాగింది.