పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిరోజూ రెండు గంటలు శ్రమించాలని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె. వి. రత్నం పిలుపునిచ్చారు. ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా మహిళా కళాశాలలో గురువారం జరిగిన 'హరిత నూతన సంవత్సర' వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తు తరాల కోసం ఇంటి పరిసరాల్లో కూరగాయలు పండించాలని, డ్రోన్ల సాయంతో కొండలు, గుట్టలపై విత్తనాలు చల్లాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. కాసు విత్తన బంతుల తయారీ ఆవశ్యకతను వివరించగా, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేత సుబ్రహ్మణ్య వర్మ ఈ నెల 13న బీచ్ రోడ్డులో లక్ష పిడకలతో నిర్వహించే భోగి వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.