విశాఖ: ప్రకృతి ఆధారిత పంటలనే ఆహారంగా తీసుకుందాం

8చూసినవారు
విశాఖ: ప్రకృతి ఆధారిత పంటలనే ఆహారంగా తీసుకుందాం
విశాఖలోని ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల వారం రోజుల సేవా కార్యక్రమాలు సోమవారం విశాఖలోని జాలాది పేటలో ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ కాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జె. వి. రత్నం, ఎన్ఎస్ఎస్ సేవలను ప్రశంసిస్తూ, ప్రకృతి ఆధారిత పంటలనే ఆహారంగా తీసుకోవాలని, పర్యావరణ హితంగా జీవించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్