విశాఖ‌: ప్రయోగాత్మక బోధనతోనే విజ్ఞానశాస్త్రంపై పట్టు

0చూసినవారు
విశాఖ‌: ప్రయోగాత్మక బోధనతోనే విజ్ఞానశాస్త్రంపై పట్టు
సైన్స్ ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రయోగపూర్వక బోధన ద్వారా విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ సూచించారు. అక్కయ్యపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా కృత్రిమ మేధ వంటి సాంకేతికతను బోధనలో జోడించుకోవాలని కోరారు. ముఖ్యంగా 6, 7 తరగతుల నూతన పాఠ్యపుస్తకాలపై పట్టు సాధించి, వినూత్న విద్యా వీడియోలు, పోస్టర్ల ద్వారా బోధనా సామర్థ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్