విశాఖ ఎంపీ శ్రీ భరత్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పురోగతిపై దృష్టి సారించారు. సోమవారం విశాఖ, విజయనగరం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో విమానాశ్రయానికి అవసరమైన రవాణా అనుసంధానంపై చర్చించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయి అడ్డంకులను తొలగించి, నిర్ణీత గడువులోగా మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.