కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన '4 లేబర్ కోడ్ల'ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ 2026, ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. గురువారం మద్దిలపాలెంలోని ఏచూరి భవన్‌లో సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. వి. ఎస్. కె. కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులను బానిసలుగా మార్చేందుకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, ఈ 4 కొత్త కోడ్లను అమలులోకి తెస్తున్నారని మండిపడ్డారు.