విశాఖ: పొగడ్తలు వద్దు.. పని కావాలి: పవన్ కళ్యాణ్

11చూసినవారు
విశాఖ: పొగడ్తలు వద్దు.. పని కావాలి: పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. తనకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదని, క్షేత్రస్థాయిలో పని మాత్రమే కావాలని అధికారులను స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ నిధులు రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అధికారులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, నిబంధనల మేరకు పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలని, విధుల్లో అలసత్వాన్ని సహించబోనని హెచ్చరించారు.

ట్యాగ్స్ :