విశాఖ: ఫిర్యాదుదారులతో అధికారులే నేరుగా మాట్లాడాలి

6చూసినవారు
విశాఖ: ఫిర్యాదుదారులతో అధికారులే నేరుగా మాట్లాడాలి
విశాఖ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. సమస్యలపై ఫిర్యాదు చేసిన వారితో సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులే నేరుగా మాట్లాడాలని, దిగువ స్థాయి సిబ్బంది మాట్లాడటానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించిన ఆయన, గత నివేదికలను పరిశీలించి, ఫిర్యాదులపై అధికారులు తూతూమంత్రంగా కాకుండా, చొరవతో నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్