విశాఖ: భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవితకు తలమానికం

3చూసినవారు
విశాఖ: భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవితకు తలమానికం
విశాఖపట్టణంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ మహాకార్యాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి, మంత్రులు పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారని తెలిపారు. బుధవారం, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సదస్సు ఏర్పాట్లను స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్