విశాఖ: జర్నలిస్టులందరికీ బీమా ఆరోగ్య ప్రీమియం చెల్లించండి

7చూసినవారు
విశాఖ: జర్నలిస్టులందరికీ బీమా ఆరోగ్య ప్రీమియం చెల్లించండి
వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించాలని కోరుతూ ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలు సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేంద్ర ప్రసాద్‌ను కలిశారు. పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ఫెడరేషన్ అధ్యక్షులు పి. నారాయణ్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ప్రీమియం చెల్లిస్తున్నారని, రేషన్ కార్డు లేని జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్