సింహాచలంలోని గిరి ప్రదక్షిణలో భాగంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్త జనంతో అప్పన్న స్వామి తొలి పావంచా వద్ద భారీ రద్దీ నెలకొంది. బుధవారం రాత్రి 9 గంటల దాటిన తరువాత కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. రద్దీ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారంటూ పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ
ఎత్తున భక్తులు వస్తారని తెలిసినప్పటికీ రోప్ పార్టీలు ఏర్పాటు చేయకపోవడంతో పోలీసు సిబ్బంది అక్కడ ఉన్నా రద్దీని నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది.