ర‌హ‌దారుల్లో వేగ ప‌రిమితి పెంచిన విశాఖ పోలీసులు

6చూసినవారు
నగరంలో వాహనదారుల ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు పోలీసులు పలు రహదారుల్లో వేగ పరిమితిని పెంచారు. పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి శనివారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆనందపురం-పినగాడ, మోపాడ-ఆర్‌కే టౌన్‌షిప్ వంటి జాతీయ రహదారుల్లో వేగ పరిమితిని 60 కి.మీ.కి పెంచగా, బీచ్ రోడ్డు, బీఆర్‌టీఎస్ వంటి మార్గాల్లో పాత పరిమితి 40 కి.మీ. కొనసాగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్