విశాఖ బీచ్‌రోడ్డులోని 44 ఏళ్ల మత్స్యదర్శిని భవనాన్ని GVMC హైకోర్టు అనుమతితో కూల్చివేసింది. లీజుదారుడు ఏళ్ల తరబడి అద్దెలు చెల్లించకుండా రాజకీయ అండతో కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.5 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. భవనం శిథిలావస్థకు చేరిందని ఏయూ నిపుణులు నివేదిక ఇవ్వడంతో కోర్టును ఆశ్రయించిన GVMCకి అనుమతి లభించింది. మత్స్యదర్శినిలోని చేపలను భద్రంగా ఆ శాఖకు అప్పగించారు.