విశాఖ: మద్యం దుకాణం వ‌ద్దంటూ ఆందోళన

77చూసినవారు
విశాఖ: మద్యం దుకాణం వ‌ద్దంటూ ఆందోళన
విశాఖ‌లోని వెలంపేట 35వ వార్డు ప్రాంతంలో మంగ‌ళ‌వారం కొత్తగా మద్యం దుకాణం తెరవగా స్థానిక మహిళలు ధర్నాకు దిగారు. ఈ ప్రాంతంలో 4000 మంది నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయ‌ని. వారి నివాసాల మధ్య మద్యం షాప్ ఏర్పాటుకు పర్మిషన్ రావడం ఆవేదన వ్యక్తం చేశారు. ఆల‌యాలు, అంగ‌న్‌వాడీ కేంద్రానికి స‌మీపంలో మ‌ద్యం షాపున‌కు ఎలా అనుమ‌తి ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.

సంబంధిత పోస్ట్