విశాఖ: న్యూస్ రీడింగ్ మెదడుకు మల్టీవిటమిన్ లాంటిది

5చూసినవారు
విశాఖ: న్యూస్ రీడింగ్ మెదడుకు మల్టీవిటమిన్ లాంటిది
వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ అరేనాలో విద్యార్థులకు ఆంగ్ల వార్తాపత్రిక పఠనంపై అవగాహన కార్యక్రమం జరిగింది. సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి ఈదర రవికిరణ్ మాట్లాడుతూ, ప్రతిరోజూ పేపర్ చదవడం మెదడుకు మల్టీవిటమిన్ లాంటిదని, ఇది ఆంగ్ల భాషా నైపుణ్యంతో పాటు సమకాలీన అంశాలపై అవగాహనను పెంచుతుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు తరహాలోనే మానవ మెదడు కూడా వ్యాకరణ నియమాల కంటే పదాల అమరిక ఆధారంగానే భాషను నేర్చుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ ఛైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్