జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు ఆదివారం విశాఖలోని అక్కయ్యపాలెంలో తన కార్యాలయంలో జర్నలిస్టులకు సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తన సొంత నిధులతో జర్నలిస్టు మిత్రులకు పండుగ కానుకలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి మూడు కేజీల చొప్పున రసాయనాలు లేని స్వచ్ఛమైన బెల్లం, సింహాచల అప్పన్న అలంకరణలతో కూడిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌తో పాటు ప్రత్యేక బహుమతులను అందజేశారు. జర్నలిస్టులందరూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.