విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

1776చూసినవారు
వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బలపడి మరికొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ దిశగా కదులుతూ శనివారానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, రానున్న 24 గంటలలో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్