విశాఖ: హనుమంతవాక జంక్షన్‌లో పనిచేయని సిగ్నళ్లు

14చూసినవారు
విశాఖ: హనుమంతవాక జంక్షన్‌లో పనిచేయని సిగ్నళ్లు
విశాఖ నగరంలోని హనుమంతవాక ప్రధాన జంక్షన్‌లో గత పది రోజులుగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ నిలిచిపోయింది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ కూడలిలో సిగ్నళ్లు పనిచేయకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారింది. నాలుగు వైపుల నుంచి వాహనాలు ఒకేసారి దూసుకువస్తుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్