విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను గడువులోపు వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.