విశాఖ;చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి

5చూసినవారు
విశాఖ;చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి
అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కపరాడ ట్రైబల్ హాస్టల్‌లో ఆదివారం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. రవి కుమార్ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు చెడు వ్యసనాలకు, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాగా చదువుకొని కుటుంబాలకు, గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాని కార్యదర్శి కటారి శోభన్ కుమార్, ట్రెజరర్ సీస శోభన్, సమ రెడ్డి బాల గంగాధర్ తిలక్, వాంతల ఆనంద్, కోటి బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్