విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, మిలాన్, సిటీ పరేడ్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో కలిసి ఆయన ఏర్పాట్లపై చర్చించారు. ఫిబ్రవరి 17న రాష్ట్రపతి రాకతో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భాగంగా 18న ఫ్లీట్ రివ్యూ, 19న అంతర్జాతీయ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. సుమారు మూడు లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్కే బీచ్ రోడ్డులో గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, పటిష్టమైన భద్రత కల్పించాలని, నగరాన్ని సుందరీకరించడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, వేడుకల సమయంలో 'నో డ్రోన్, నో కైట్' జోన్‌ను అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.