విశాఖ: కళాశాల భవనం ఎక్కి విద్యార్థుల ఆందోళన

8చూసినవారు
విశాఖ: కళాశాల భవనం ఎక్కి విద్యార్థుల ఆందోళన
విశాఖ ఎంవీపీలోని సమతా కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న సాయితేజ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల అధ్యాపకురాలి వేధింపులే దీనికి కారణమని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగే వరకు కళాశాల ప్రాంగణం నుంచి కదిలేది లేదని తోటి విద్యార్థులు శనివారం నిరసన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే దూకేస్తామంటూ ముగ్గురు విద్యార్థులు కళాశాల భవనం నుంచి నిరసన తెలిపారు. పోలీసులు వారించే ప్రయత్నం చేసినా, సాయితేజ కుటుంబ సభ్యులు, విద్యార్థులు గేట్లు తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగింది.

ట్యాగ్స్ :