మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతమైన మాధవధారలో గల మాధవస్వామి ఆలయం వద్ద నిత్యం ప్రవహించే జలధార కారణంగా ఈ ప్రాంతానికి 'మాధవధార' అనే పేరు వచ్చింది. పూలతోటలు, పండ్లతోటల మధ్య ఉన్న ఈ ప్రదేశానికి ప్రాచీన చరిత్ర ఉంది. ఇక్కడ మాధవస్వామి, వేణుగోపాలస్వామి, శివాలయాలు ప్రసిద్ధిగా ఉన్నాయి. కార్తీక మాసంలో వేలాది మంది వనయాత్రలు చేసి, ఇక్కడ మెట్ల మార్గం ద్వారా సింహాచలం ఆలయానికి చేరుకుంటారు.