విశాఖ‌: కూటమి ధర్మాన్ని కాపాడాలి

5చూసినవారు
విశాఖ తూర్పు నియోజకవర్గంలోని దేవాలయ కమిటీల నియామకాల్లో జనసేన కార్యకర్తలకు చోటు దక్కకపోవడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కారకచేట్టు పోలమాంబ ఆలయ పాలకమండలిలో జనసేనకు మూడు అవకాశాలు రావాల్సి ఉండగా, ఒక్కరికి కూడా చోటు దక్కలేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశించిన 30 శాతం రిజర్వేషన్ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం జనసైనికులను నిరాశకు గురిచేస్తోందని, ఈ పొరపాట్లపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్