విశాఖ‌: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

1చూసినవారు
విశాఖ‌: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
విశాఖపట్నంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్ఓ ఎం. విశ్వేశ్వర నాయుడు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. సంబంధిత శాఖల అధికారులు ఆయా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్