విశాఖ: ఇంధన కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్‌

2చూసినవారు
విశాఖ: ఇంధన కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్‌
జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ స్పష్టం చేశారు. 238 బంకులకు నిరంతరాయంగా ఇంధన సరఫరా జరుగుతోందని, ప్రస్తుతం 2,200 కిలోలీటర్ల పెట్రోల్‌, 2,677 కిలోలీటర్ల డీజిల్‌ నిల్వలున్నాయని తెలిపారు. పుకార్లతో ప్రజలు ఒకేసారి బంకులకు రావడంతో రద్దీ ఏర్పడిందని, అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని కోరారు. పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌ (0891-2590100) ఏర్పాటు చేశామని, అధికారులు బంకులను తనిఖీ చేస్తున్నారని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్