విశాఖ: ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు

0చూసినవారు
ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. గత 24 గంటల్లో విజయనగరం జిల్లా తెర్లాంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్