ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోలీసు వ్యవస్థను కించపరుస్తున్న వైసీపీ నేతల తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. హోం మంత్రి అనిత మాట్లాడుతూ, అంబటి రాంబాబు వంటి నేతలు ఉపయోగిస్తున్న భాష సిగ్గుచేటని, గతంలో చిన్న పదానికి కూడా దాడులకు పాల్పడ్డ వైసీపీ, ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడటం ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబును టచ్ చేస్తే సహించేది లేదని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు.