విశాఖ: వృక్షాల్లో ఋషి లక్షణాలు ఉన్నాయి

9చూసినవారు
విశాఖ: వృక్షాల్లో ఋషి లక్షణాలు ఉన్నాయి
విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ ఏబీసీ పార్కులో జరుగుతున్న శ్రీమద్భాగవ ప్రవచన యజ్ఞంలో సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ, వృక్షాల్లో సత్పురుషుల లక్షణాలు ఉన్నాయని తెలిపారు. శనివారం రాత్రి ఆయన శ్రీకృష్ణుడిపై ప్రకృతి చూపిన భక్తి తత్వాన్ని వివరించారు. శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ పరిశోధనలను ప్రస్తావిస్తూ, వృక్షాలకు స్పందన ఉంటుందని చెప్పారు. భాగవతం, భగవద్గీత బోధలను సమన్వయంతో అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్