కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశారు. నగర విమానాశ్రయంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, పలువురు
టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మౌలిక సదుపాయాలు బలోపేతం అవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.