విశాఖ: పెళ్లింట తీరని విషాదం: వరుడు ఆత్మహత్య

2352చూసినవారు
విశాఖ: పెళ్లింట తీరని విషాదం: వరుడు ఆత్మహత్య
విశాఖపట్నం: పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భీమిలి మారికవలసకు చెందిన చంద్రశేఖర్ (25), సాగర్ నగర్ చిత్రలహరి స్టూడియోలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి శుక్రవారం వివాహం జరగాల్సి ఉండగా, బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్