విశాఖ: పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న వీఎంఆర్‌డీఏ చైర్మన్

7చూసినవారు
విశాఖ: పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న వీఎంఆర్‌డీఏ చైర్మన్
విశాఖపట్నంలోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్ మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్