విశాఖపట్నంలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కార్యాలయం ఎదుట కృష్ణకుమారి అనే మహిళ శనివారం వినూత్న నిరసన తెలిపారు. తన భర్త జీసీసీలో పనిచేసి రిటైర్ అయినప్పటికీ, గ్రాడ్యుటీ, ఇతర ప్రయోజనాలు అందేందుకు ఏడాదిగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. కుమార్తె పెళ్లి కోసం డబ్బులు అవసరమని కోరితే, అధికారులు లక్ష రూపాయలు లంచం అడిగారని కన్నీటిపర్యంతమయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి తమ బకాయిలు ఇప్పించాలని ఆమె డిమాండ్ చేశారు.