విశాఖ సిరిపురం 'లవ్ వైజాగ్' సర్కిల్ వద్ద శనివారం రాత్రి కొంతమంది యువకులు బర్త్‌డే పార్టీ పేరిట రోడ్డుపై కేకులు రుద్దుకుంటూ హంగామా చేశారు. దీనితో స్థానికులకు అసౌకర్యం కలిగింది. పార్టీ చేసుకోవడంలో తప్పులేదు కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వీరంగం చేయడం సరైంది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.