విశాఖపట్నంలోని ఇసుకతోట జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లిపురానికి చెందిన రాజేశ్, ఆకాశ్ అనే ఇద్దరు యువకులు బైక్‌పై మధురవాడ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశ్ కింద పడిపోగా, ట్యాంకర్ చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు ఆకాశ్ గాయాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.