విశాఖ జిల్లాలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ: కలెక్టర్

2చూసినవారు
విశాఖ జిల్లాలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ: కలెక్టర్
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. జూన్ 14న ప్రారంభమైన ఇంటింటి సర్వే జూలై 14 వరకు కొనసాగుతుంది. జిల్లాలోని మొత్తం 20,23,009 మంది ఓటర్లలో ఇప్పటికే 80 శాతం మందికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, 14 లక్షలకు పైగా ఓటర్ల వివరాల మ్యాపింగ్ జరిగిందని చెప్పారు. ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఈ ఫారం నింపి, సంతకం చేసి బీఎల్‌వోకు ఇవ్వాలని, లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోతారని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్